ప్రేమపై కృతి శెట్టి షాకింగ్ స్టేట్మెంట్!

Purushottham Vinay
ఉప్పెన సినిమా ఇచ్చిన హిట్ సక్సెస్ జ్యోష్ నుంచి కృతి శెట్టి బయట పడకముందే.. `శ్యామ్ సింగరాయ్` `బంగార్రాజు` రూపంలో మరో రెండు సూపర్ హిట్స్ ఆమె అకౌంట్ లో పడ్డాయి. దీంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న కృతి శెట్టికి.. ప్రస్తుతం ఆఫర్లు క్యూ కడుతున్నాయి.యంగ్ హీరోలకే కాదు స్టార్ హీరోలకు కూడా కృతి శెట్టి బెస్ట్ ఆప్షన్ గా మారుతుంది. అయితే ఈ యంగ్ బ్యూటీ కెరీర్ పరంగానే కాదు ఇంకా సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతోంది.అదిరిపోయే ఫొటో షూట్లతో పాటు తరచూ చిట్ చాట్ సెషన్స్ ని కూడా నిర్వహిస్తూ భారీగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇక తాజాగా  కృతి శెట్టి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ప్రేమపై బిగ్ స్టేట్మెంట్ ని ఇచ్చింది. హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. `నేను ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టాను. నేను కోరుకున్న విధంగా అవకాశాలు అనేవి లభిస్తున్నాయి.


 ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా గడుపుతున్నా.ప్రేమ గురించి ఆలోచించేంత టైం నాకు లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటించాలనుంది. నా పూర్తి ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉంది. మరికొన్నేళ్ల పాటు కూడా నా కెరీర్ మీదనే దృష్టి పెడతా.` అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రేమ పెళ్లి వంటివి ఇప్పట్లో తన లైఫ్ లో లేవని హాట్ బ్యూటీ కృతి శెట్టి పరోక్షంగా చెప్పకనే చెప్పేసింది.కాగా ఈ యంగ్ అండ్ హాట్ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.. సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఇంకా నితిన్ సరసన `మాచర్ల నియోజవర్గం` చిత్రాలు చేస్తోంది. అలాగే టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి జోడీగా `ది వారియర్` సినిమాలో నటించింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా జూలై 14 వ తేదీన తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన బాల దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు సైన్ చేసింది. ఇది కృతి శెట్టికి మొదటి తమిళ చిత్రం కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: