కోలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు అయినా మణిరత్నం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి కాలంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్న మణిరత్నం ఈ మధ్య కాలంలో మాత్రం ఆరెంజ్ విజయా లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోతున్నాడు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత కాలంగా తడబడుతున్న స్టార్ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూవీ ని దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీన 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1 ను విడుదల చేసేందుకు మేకప్ సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీ లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ని మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు ముందే అదిరిపోయే సూపర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను చేసుకుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
పొన్నియన్ సెల్వన్ రెండు భాగాల డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్ సుమారు రూ. 125 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలకు ముందే భారీ 'ఓ టి టి' ఆఫర్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా మణిరత్నం తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడు అని కొంత మంది భావిస్తున్నారు.