టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయినా
పరశురామ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు నిఖిల్
సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన యువత సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ
సినిమా తర్వాత ఆంజనేయులు ,సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలకు
పరశురామ్ దర్శకత్వం వహించాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన
గీత గోవిందం
సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.
గీత గోవింద సినిమాతో
పరశురామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.
ప్రస్తుతం
పరశురామ్ 'సర్కారు వారి పాట' సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు
తమన్ సంగీతం సమకూర్చగా సముద్ర కని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ
సినిమా మే 12 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ
సినిమా దర్శకుడు
పరశురామ్ ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
పరశురామ్ మాట్లాడుతూ... మహేష్ బాబు ఇది వరకు చేసిన ఏ
సినిమా పాత్ర తోను ఈ
సినిమా పాత్రను పోల్చలేము. ఈ
మూవీ లో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఈ
మూవీ లో మహేష్ బాబు యాటిట్యూడ్ కూడా సూపర్ గా ఉంటుంది. అన్నిటి కంటే ముఖ్యంగా ఈ సినిమాను మహేష్ బాబు ఒకే చేయడానికి ప్రధాన కారణం ఈ
మూవీ లో ఆయన పాత్ర యాటిట్యూడ్ అని తాజా ఇంటర్వ్యూలో
పరశురామ్ తెలియజేశాడు.