మెగాస్టార్
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్
మూవీ ని ఎన్వీ
ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ
మూవీ లో
బాలీవుడ్ స్టార్
హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే
గాడ్ ఫాదర్ చిత్ర బృందం
చిరంజీవి ,
సల్మాన్ ఖాన్ లపై ఒక సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కబోయే సాంగ్ కి
ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయబోతున్నాడు.
చిరంజీవి , సల్మాన్ ఖాన్ ఇద్దరి తోనూ
ప్రభుదేవా మూవీ లను తెరకెక్కించాడు. ఈ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ లో పై కూడా
ప్రభుదేవా కు మంచి అవగాహన ఉంది. ఇది ఇలా ఉంటే
ప్రభుదేవా కూడా తన వైపు నుంచి ఈ సాంగ్ కి అదిరిపోయే రేంజ్ లో కొరియోగ్రఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గాడ్ ఫాదర్ మూవీ చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు భోళా
శంకర్ , బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.