ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టు కే చిత్రం యొక్క పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఆయన హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం నిరాశపరిచిన కూడా త్వరలోనే రాబోతున్న సలార్ సినిమా తప్పకుండా అభిమానుల అంచనాలను అందుకుంటుంది అని భావిస్తున్నారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు అంటున్నారు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ఆదిపురుష్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ఇదే సమయంలో నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు కే సినిమాను కూడా ఎంతో బాగా చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు సినిమా కోసం ఎదురు చూడవలసి ఉంది అని తెలుస్తుంది. పాన్ వరల్డ్ సినిమా గా రాబోతున్న ఈ చిత్రం లో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు. మొన్నటి దాకా ప్రభాస్ విదేశాలకు వెళ్లడం తో షూటింగ్ లో ఆలస్యంగా జాయిన్ అయ్యాడు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగ్ మధ్య ఈ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు.
ఏదైతేనేం ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగి పోవడం ఖాయం అని అంటున్నారు. టైం ట్రావెల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది అని అంటున్నారు. మంచి విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ప్రాజెక్టు కే సినిమా విడుదల తేదీ విషయంలో త్వరలోనే క్లారిటీ అవకాశం ఉంది. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకోవాలని ప్రభాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మరో ఆసక్తికరమైన కూడా చేస్తున్నాడు ప్రభాస్.