కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరో గా నటించిన కేజిఎఫ్ సినిమా రోజుకో సంచలనం సృష్టిస్తూ మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఏప్రిల్ 14వ తేదీన ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాయగా ఇప్పుడు సరికొత్త సంచలనాలు సృష్టించే విధంగా ముందుకు వెళుతుంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన మొదటి భాగం సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ విధంగా ఈ చిత్ర రెండవ భగానికి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచాయి.
ఆ అంచనాలను అందుకుంటూ ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ విధంగా ఈ హీరోని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన ఈ దర్శకుడికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. 1000 కోట్ల క్లబ్ లో చేరడం లో ప్రముఖ పాత్ర పోషించిన ఈ దర్శకుడు ఇంతటి స్థాయి లో సంచలనం సృష్టిస్తాడు అని ఎవరు కూడా కలలో కూడా అనుకోలేదు. మొదట్లో ఓ యాక్షన్ కథతో చాలా మందిని ఎంతగానో అలరింపచేశాడు ఈ దర్శకుడు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని చేయగా అది కాస్తా సూపర్ హిట్ అయ్యింది. అప్పుడే పెద్ద హీరోల చూపు పడింది.
అలా యశ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమ చరిత్రలో 100 కోట్లు సాధించిన సినిమా ఏదీ లేదు. అలాంటిది ఈ సినిమా ఆ ఫీట్ ను సాధించడంతో పాటు వెయ్యి కోట్లు సాధించిన సినిమా కూడా ఇదే రికార్డులకెక్కింది ఈ నేపథ్యంలో తన ప్రతి సినిమాకు 50 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడట. ఈ స్థాయిలో విజయాన్ని అందించే ఏ దర్శకుడైనా ఇంతటి స్థాయిలో పారితోషకం తీసుకోవడం సబబే అని కొంతమంది చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో సినిమా చేస్తుండగా దీనికి దాదాపు అంతే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఆ తర్వాత దానయ్య తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి కూడా ఆ స్థాయిలోనే రే ఉదయం తీసుకుంటూ ఉండటం విశేషం.