వామ్మో.. కేజిఎఫ్ సినిమా స్పూఫ్.. వామ్మో ఇదేం కామెడీ?

praveen
" data-original-embed="">
ఏదైనా సినిమా విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది అంటే చాలు ఇక ఆ సినిమాకు ఎంతో మంది స్పూఫ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో అయితే బుల్లితెరపై ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ షో లో ఇలాంటి హిట్ సినిమాలకు సంబంధించిన స్పూఫ్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులకు అరుదైన కామెడీ పంచుతూ సినిమా ఎంటర్టైన్మెంట్ ని సైతం మైమరిపిస్తూ ఇక అందరికీ ఉపశమనం కలిగిస్తుంది జబర్దస్త్ అనే కార్యక్రమం. ఇక బుల్లితెర ప్రేక్షకులందరికీ నవ్వులకు చిరునామా గా మారిపోయింది ఈ కార్యక్రమం.


 బుల్లితెర కామెడీ షోస్ లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక జబర్దస్త్ కామెడీ ని మరింత రెట్టింపు చేసేందుకు ఎక్స్ ట్రా జబర్దస్త్ ని కూడా ప్రతి శుక్రవారం ప్రేక్షకులను అలరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా అందరూ ఎంతో సరికొత్త స్కిట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అన్నది అర్థమైంది. అయితే ఎప్పుడూ సరికొత్తగా ప్రయత్నించే బుల్లెట్ భాస్కర్ టీం ఇక ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కే జి ఎఫ్ సినిమా స్పూఫ్ చేశారు.


 ఇక ఈ కే జి ఎఫ్ స్పూఫ్ కాస్త బాగా పండింది అనే చెప్పాలి. అంతేకాదు కేజిఎఫ్ లోని సెంటిమెంట్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా తమ కామెడీ పంచ్ లతో పూర్తిగా మార్చేసి అందరికీ నవ్వులు పంచారూ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో మొత్తంలో బుల్లెట్ భాస్కర్ టీం పర్ఫామెన్స్ హైలెట్గా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇక ఈ ఫుల్ స్కిట్ చూడాలని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమో పై ఒక లుక్కేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: