నక్సలిజం సినిమాలు అంటే అభిమానులు భయపడుతున్నారా..?

Divya
తెలుగు సినిమాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా మన టాలీవుడ్ చిత్రాలు సైతం పాన్ ఇండియా లేవలో విడుదల అవుతూ కొన్ని సంచలన కూడా సృష్టిస్తున్నాయి. దీంతో మన స్టార్స్ సైతం సరి కొత్త సినిమా కథలతో తెరపైకి వస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నక్సలిజం నేపథ్యంలో వస్తున్న కొన్ని చిత్రాలు ఆ స్టార్ హీరో అభిమానులను సైతం భయపడేలా చేస్తుంది. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.

కంటెంట్ సరిగ్గా లేకపోవడం పలు వివాదాస్పద అంశాల వల్ల ఇలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేక పోతున్నాయి. గతంలో నారాయణ మూర్తి, దాసరి వంటి చిత్రాలు ఎన్నో విజయాలు అందుకున్నాయి. ఇక మరే దర్శకులు కూడా ఇలాంటి సినిమాల ని టచ్ చేస్తే ఫ్లాప్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి పరిస్థితిని డైరెక్టర్ కొరటాల శివ కూడా ఎదుర్కొన్నారు. ఆచార్య సినిమా లో ఎవరూ ఊహించని విధంగా సినిమా ఫ్లాప్ కావడం జరిగింది. ఈ సినిమాలో స్టార్ హీరోలు నటించినప్పటికీ ఎవరూ కాపాడలేకపోయారు. ఇక ఈ చిత్రం లోని కథా కథనాలు సరిగ్గా లేకపోవడం వల్లే.. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
అయితే ఇప్పుడు తాజాగా అందరి దృష్టి విరాట పర్వం సినిమా పైన పడింది. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి, హీరోగా రానా నటించారు. ఎన్నో అభ్యుదయ భావాలను ఒక డాక్టర్ నక్సలైట్ గా మారి విప్లవ రచనలు చేయడం అనే కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ చిత్రం తెలంగాణలో 1990 బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరుగుతోంది. చిత్రం గత ఏడాది ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. మరి ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: