పాపం: మెగా హీరోలకు ఏమైంది..??

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిగతా ఫ్యామిలీ కంటే మెగా హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండే ఉంటుందని చెప్పవచ్చు. దాదాపుగా డజను మంది హీరోలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ హీరోలు నటించిన సినిమాలు ఎక్కువగా థియేటర్లలో విడుదల అవుతూ ఉంటాయి. అందుచేత బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోల సందడి బాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం మెగా హీరోలు నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేక పోతున్నాయి. అందుచేత మెగ అభిమానులు సైతం నిరుత్సాహానికి గురవుతున్నారు.

కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఎక్కువగా సినిమాలు విడుదల కాలేదు కానీ విడుదలైన కొన్ని సినిమాల్లోనే ఒక్కటి కూడా రికార్డు క్రియేట్ చేయడం లేదని మెగా అభిమానులు చాలా కలవరపడుతున్నారు. వకీల్ సాబ్ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన.. ఈ సినిమా మా హిట్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది. అంతే కాకుండా కొన్ని ఏరియాలలో బయ్యర్లు నష్టాలు వచ్చినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా రిపబ్లిక్, బ్రతికే సో బెటర్ అనే రెండు సినిమాలు విడుదల చేయగా అవి కూడా ఫ్లాప్ ను చూశాయి.

ఇక మరొక హీరో వైష్ణవి తేజ్ కూడా కొండపొలం ఈ సినిమాతో డిజాస్టర్ గా మిగిలాడు. ఇక వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇద్దరూ తన తదుపరి చిత్రంతో మంచి విజయం సాధించాలని చాలా తాపత్రయపడుతున్నారు. ఇక మెగాస్టార్ అల్లుడు సూపర్ మచ్చి సినిమాతో వచ్చిన కళ్యాణ్ దేవ్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది భీమ్లా నాయక్ ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరించిన ఇటువంటి రికార్డులను సైతం సృష్టించ లేకపోయింది. ఇక చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం కూడా భారీ ఫ్లాప్ ను అందుకుంది. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక విజయాన్ని అందుకున్నాడు. అయితే అభిమానులు సైతం మెగా హీరోలకు ఏమైంద అంటూ కలవరపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: