టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న శర్వానంద్ ప్రస్తుతం మాత్రం వరుస అపజయలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటూ డీలా పడిపోయి ఉన్నాడు. ఒకనొక సమయంలో రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి వంటి వరుస విజయాలతో ఓ వెలుగు వెలిగిన శర్వానంద్ 'పడి పడి లేచే మనసు' సినిమా తర్వాత మాత్రం బాక్సాఫీసు దగ్గర వరుస అపజయలను ఎదుర్కొంటున్నాడు.
శర్వానంద్ వరసగా పడి పడి లేచే మనసు , రణరంగం , జాను , శ్రీకారం , మహా సముద్రం , ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి వరస పరాజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొని ప్రస్తుతం ఒక విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో అక్కినేని అమల కనిపించబోతోంది. శర్వానంద్ ఈ మూవీ తర్వాత యు వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.
యు వి క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ ఇది వరకు రన్ రాజా రన్ , ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి. ఇలా తనకు రెండు విషయాలను అందించిన యు వి క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యు వి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి శర్వానంద్ ఓకే చెప్పడంతో యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు శర్వానంద్ కి తగిన కథ కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇలా హిట్ ట్రాక్ లోకి రావడానికి శర్వానంద్ ఇది వరకు తనకు విజయాలను అందించిన యు వి క్రియేషన్స్ బ్యానర్ తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది.