పెళ్లి , పిల్లల పై స్పష్టత ఇచ్చిన పూనమ్ కౌర్.. కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి అంటూ ట్వీట్..!!
ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాల కథలు అల్లేసారు.. ఎప్పుడు పెళ్లయింది.. అప్పుడే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా..? అంటూ కామెంట్లు కూడా చేశారు.. పూనం కౌర్ పెళ్లి, పిల్లల గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది.. వాళ్ళిద్దరూ తన పిల్లలు కాదు అని.. ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు అని.. కాస్త తనను బ్రతక నివ్వండి అంటూ ట్వీట్ చేసింది.. ఇక ఇప్పటి వరకు తనకు జరిగిన నష్టం చాలు.. ఈ ఫోటోలో ఉన్నది తన స్నేహితుల పిల్లలు అని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన సోషల్ మీడియా కి కూడా ధన్యవాదాలు.. నన్ను కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి అంటూ దండం పెడుతున్న ఏమోజీ తో రాసుకొచ్చింది పూనమ్ కౌర్.
అయితే ఈ ట్వీట్ పై మరికొంత మంది నెటిజన్లు స్పందిస్తూ పోస్ట్ చేసినప్పుడే క్లారిటీగా చెప్పి ఉంటే ఇలాంటి చర్చలు జరిగేవి కాదు కదా అని కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె సరైన ఆఫర్లు లేక గత కొద్దిరోజుల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే తాజాగా నాతిచరామి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఇది కూడా డిజాస్టర్ గా మిగిలింది.