టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విశ్వక్ సేన్ ఆ తర్వాత పలక్ నామ దాస్ , హిట్, పగలు వంటి పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరుచుకున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో హీరో గా నటించాడు.
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ లో రుక్షర్ ఢిల్హాన్ , విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు విద్యాసాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ట్రైలర్ లో 33 సంవత్సరాలు వచ్చినా కానీ పెళ్లి కాకపోవడం వల్ల విశ్వక్ సేన్ ఎదుర్కొనే కష్టాలను గురించి చూపించారు.
ఈ సినిమా కూడా 33 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి కాకపోవడం వల్ల విశ్వక్ సేన్ ఎదుర్కొనే కష్టాల గురించి తెరకెక్కించినట్లు ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను మే 6 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్ అనేక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. అందులో భాగంగా నటుడుగా అన్ని రకాల సినిమాలు చేయాలి కాబట్టి , అమ్మాయిల నటించడానికి కూడా సిద్ధమేనని విశ్వక్ సేన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.