ఆకట్టుకుంటున్న సమంత యశోద మూవీ ఫస్ట్ గ్లింప్స్..!!
అంతేకాకుండా ది ఫ్యామిలీ మాన్ అనే వెబ్ సిరీస్ తో నేషనల్ స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది. ఇక తను నటిస్తున్న యశోద సినిమా విషయానికి వస్తే .. శ్రీదేవి పతాకంపై నిర్మాత శివ కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. ఈ సినిమాతో హరి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్ ను విడుదల చేయడం జరిగింది.
ఇక ఆ గ్లింప్ విషయానికి వస్థే.. సమంత ఒక బెడ్ పై నుంచి లేచి కళ్ళు తెరిచి తనను తాను ఆశ్చర్యంగా చూసుకుంటున్నట్లు గా మనం గమనించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే తను వేరే లోకంలో నుండి వచ్చినట్లుగా కనిపిస్తోంది. తనకు.. అక్కడ ఉన్న ప్రదేశానికి ఎటువంటి సంబంధం లేననట్లుగా ఎంతో అయోమయంగా కనిపిస్తున్నది. అలా బెడ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్లి కిటికీలో నుంచి బయట ఉన్న పావురాన్ని ముట్టుకోవడానికి ట్రై చేసింది ఆ తర్వాత సమంత ఉన్న ప్రదేశాన్ని ఒక పజిల్ లాగా అయోమయం లో చూపించారు. సమంత అక్కడ ఎందుకు ఉంది ఆమెకు ఏమైంది అనే విషయం తెలియాలి అంటే ఆగస్టు 12వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.