టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో కొత్త దర్శకుడిగా విద్యాసాగర్ చింత పరిచయమవుతున్నాడు.ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. గ్రామీణ నేపథ్యంలో .. 'పెళ్లి చూపులు' అనే అంశం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. జై క్రిష్ ఈ సినిమాకి మ్యూజిక్ ని సమకూర్చాడు. బాపినీడు ఇంకా సుధీర్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. రేపే విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ బాగా జోరందుకున్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పందించాడు. ఇక ఈ సినిమా స్పెషల్ షోను తాను చూసినట్టుగా సాయిధరమ్ తేజ్ చెప్పలేదు గానీ ఈ సినిమాలోని పాయింట్ తనకి బాగా కనెక్ట్ అయిందని ఆయన చెప్పాడు. ఈ సినిమాలో ఎంటర్టైన్ మెంట్ ఇంకా అలాగే ఎమోషన్స్ అన్నీ కూడా తనకి రిలేటెడ్ గా ఉన్నాయని అన్నాడు.ఈ సినిమాలో అర్జున్ కుమార్ అల్లం పాత్రలోకి విశ్వక్ సేన్ మారిపోయిన తీరు చూసి తాను చాలా ఆశ్చర్యపోయాయని చెప్పాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ టీమ్ కి ఆయన శుభాకాంక్షలు తెలియజేశాడు.సాయిధరమ్ తేజ్ ఆ మధ్య రోడ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
ఈ మధ్యనే ఆయన పూర్తిగా కోలుకున్నాడు. తన తాజా సినిమా షూటింగు కోసమని చాలా గ్యాప్ తరువాత కెమెరా ముందుకు వెళ్లాడు.ఇక మిగతా యంగ్ హీరోల లాగానే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఒక వైపున తనకి సంబంధించిన పనులను చక్కబెడుతూనే మరో వైపున విశ్వక్ సేన్ ను ఎంకరేజ్ చేయడానికి ఆయన ప్రయత్నించడం మెచ్చుకొదగ్గ విషయం.ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో తాను చాలా బెస్ట్ ఇచ్చానని చెప్పాడు. ఈ సినిమా తన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే అతను ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 'దాస్ కా ధమ్కీ' .. 'ఓరి దేవుడా' సినిమాలు కూడా లైన్లో ఉన్నాయని అన్నాడు. కాలేజ్ నేపథ్యంలో 'స్టూడెంట్ జిందాబాద్' సినిమా కూడా రూపొందనుందనీ ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని చెప్పాడు. ఇక త్వరలో బాలీవుడ్ కి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.