మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29 వ తేదీన థియేటర్లలో భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించగా రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ లు నక్సలైట్ లుగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఆచార్య సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందుకోలేక మొదటి రోజు నుండే నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. అలా సినిమాకు విడుదలైన మొదటి రోజు నుండే నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల పై దాని ప్రభావం పడింది. దానితో ఆచార్య సినిమాకు మొదటి రోజు మినహాయిస్తే తర్వాత రోజు నుండి అతి తక్కువగా కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర నమోదు అవుతున్నాయి. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య మూవీ రోజువారి కలెక్షన్ల గురించి తెలుసుకుందాం...
'ఆచార్య' మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.50 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
ఆచార్య' మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.15 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
ఆచార్య' మూవీ మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.07 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఆచార్య' మూవీ నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 53 లక్షల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
ఆచార్య' మూవీ అయిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 82 లక్షల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
ఈ ఐదు రోజుల తో పోలిస్తే ఆచార్య సినిమా ఆరవ రోజు అతి తక్కువ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
ఆచార్య మూవీ ఆరవ రోజు రెండు తెలుగు రాష్టాల్లో కేవలం 26 లక్షల కలెక్షన్ లను మాత్రమే సాధించింది. ఇప్పటివరకు ఆచార్య మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 40.33 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా, 59 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.