ఒక్క యాంకర్ దెబ్బకు "ముగ్గురు హీరోలు బలి"?

VAMSI
గత రెండు రోజుల క్రితం మొదలైన విశ్వక్ సేన్ మరియు టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి వివాదం ఇంకా సమసిపోలేదు. ఎవరైతే ఈ వివాదంలో ఉన్నారో వారు మాత్రం కామ్ గా ఉన్నా, సోషల్ మీడియా మాత్రం ఊరకే ఉండలేదు. ఎవరో ఒకరు నిత్యం ఈ విషయంపై విశ్వక్ సేన్ కు లేదా దేవి నాగవల్లికి మద్దతుగానో లేక వ్యతిరేకతనో తెలుపుతూ ఈ రచ్చను ఇంకా సజీవంగా ఉంచుతున్నారు. కొందరు ఏమో... నాగవల్లిది కరెక్ట్ అని చెబుతూ ఉంటే... మరి కొందరు ఏమో హీరో విశ్వక్ సేన్ ది కరెక్ట్ అని పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ఈ వివాదాన్ని చూస్తుంటే గతంలో జరిగిన మరికొన్ని వివాదాలు గుర్తుకు వస్తున్నాయి.

అయితే గతంలో ఇదే దేవి నాగవల్లి వలన మరో ఇద్దరు హీరోలు కూడా విమర్శల పాలయిన సంగతులు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. అయితే జరిగిన వివాదాలలో తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే ఈ వివాదాలు అన్నింటికీ దేవి నాగవల్లి కారణం కావడం ఒకింత చర్చనీయంశంగా మారుతోంది. మరి ఈమె ఎందుకు కావాలనే ఇప్పుడప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోలను లక్ష్యంగా చేసుకుని ఇలా చేస్తోంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు కూడా ఈమె ఇంటర్వ్యూ చేసింది ఇందులో కొన్ని సీన్ లకు సంబంధించి హీరోను ప్రశ్నించింది.

అపుడు అది కూడా పెద్ద రచ్చ అయింది. ఇటీవలే మరో యువ హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమా డీజే టిల్లు సినిమా ఇంటర్వ్యూలో వివాదాస్పద ప్రశ్నలు వేసి వార్తల్లోకెక్కింది. దీనితో ఈ ముగ్గురు హీరోలు కూడా ఈమె వైఖరికి బలయ్యారని తెలుస్తోంది. మరి ఇకనైనా దేవి నాగవల్లి వైఖరి మార్చుకుంటుందా లేదా అన్నదానిపై కూడా సోషల్ మీడియాలో పోల్స్ జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: