దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించిందో మన అందరికీ తెలిసిందే. మార్చి 25 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటివరకు 1100 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించి ప్రస్తుతం కూడా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ప్రస్తుత కాలంలో థియేటర్లలో సినిమాలు చూడ్డానికి పెద్దగా ప్రేక్షకులను ఆసక్తి చూపించకపోయినా ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం అది జరగలేదు.
రాజమౌళి సినిమాని తెరకెక్కించిన విధానం, ఆర్ ఆర్ ఆర్ మూవీ విజువల్ ఎక్స్పీరియన్స్ ని థియేటర్ లలో చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లలోకి వచ్చి సినిమాను చూశారు. దానితో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. దానితో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటి వరకు ఎన్నో సరికొత్త రికార్డులను బాక్సాఫీస్ దగ్గర సృష్టించింది. ఇలా ఇప్పటికే విడుదల అయ్యి 40 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ లను బాగానే రాబడుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మే 20న జీ 5, నెట్ ఫ్లిక్స్లలో స్ట్రీమింగ్ కానున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ లు బాగానే వస్తుండడంతో జూన్ 3 వ తేదీ వరకు 'ఓ టి టి' స్ట్రీమింగ్ తేదీని పొడిగించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాను అన్ని సినిమాల మాదిరిగా కాకుండా 'పే వ్యూ' పద్దతిలో స్ట్రీమింగ్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ పద్ధతిలో సినిమా చూడాలి అంటే సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. డబ్బులు చెల్లించిన అది ఒకసారి సినిమా చూడడానికి మాత్రమే వర్తిస్తుంది. సినిమా చూసే క్రమంలో డిస్కనెక్ట్ అయిన , సిగ్నల్ ప్రాబ్లం వచ్చినా కూడా సినిమా మరోసారి టెలికాస్ట్ కాదు. సినిమా చూడాలి అంటే మళ్లీ డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. మరి ఈ సినిమాను సబ్ సెక్షన్ ఉన్న వాళ్లందరికీ చూసే విధంగా అందుబాటులో ఉంచుతారో లేక పే వ్యూ పద్ధతులో అందుబాటులో ఉంచుతారో చూడాలి.