అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా దిల్ రాజు నిర్మాణంలో, దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిందో మన అందరికి తెలిసిందే. అలా ఎఫ్ 2 సినిమా మంచి విజయం బాక్సాఫీస్ దగ్గర సాధించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ఫ్రాంచేజి గా ఎఫ్ 3 మూవీ ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో మే 9 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన సాంగ్స్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ 3 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్ 4 మూవీ కూడా రాబోతుందట.
ఈ విషయాన్ని ఎఫ్ 3 సినిమా చివరలో చెబుతారట. అయితే ఇప్పటి వరకు ఎఫ్ 2 మరియు ఎఫ్ 3 సినిమాలలో రెండు జంటలను మాత్రమే చూపిస్తూ వచ్చారు. కాకపోతే ఎఫ్ 4 మూవీ లో మూడవ జంట కూడా ఆడ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ 4 మూవీ లో మూడవ జంటగా నాగ చైతన్య తో పాటు మరో అమ్మాయి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.