మెగా కోడలిగా, అపోలో హాస్పిటల్ చైర్మన్ గా ఎన్నో బరువు బాధ్యతలను తీసుకుంది ఉపాసన. ఇక చిరంజీవి కోడలు గా తనదైన శైలిలో బాధ్యతలను స్వీకరించి వాటిని కూడా విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతుంది. ఉపాసన మెగా కోడలిగా సినీ ఇండస్ట్రీలో, రాజకీయ ప్రముఖుల లో మంచి పేరు కూడా సంపాదించుకుంది. అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వహిస్తు ఉండగానే సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం ఎప్పుడు కొన్ని ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ ఉంటుంది. రామ్ చరణ్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ కు వెళుతూ ఉంటారు.
తాజాగా ఆచార్య సినిమా విడుదలైన వెంటనే తన 15వ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్నది. ఇక ఇలాంటి సమయంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది ఉపాసన. ఈ ఎండల నుంచి తనకు ఉపశమనం పొందడం కోసం తనకు ఎక్కడైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని ఉన్నదని తెలియజేసింది ఉపాసన. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ తెలియజేసింది. ఈ విషయంపై రామ్ చరణ్ కూడా స్పందిస్తు.. తనకు కూడా వెకేషన్ కు వెళ్లాలని ఉందని తెలియజేశాడు.
కానీ అలా వెళ్లాలంటే కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు అంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. ఏ విధంగా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ పరస్పరం స్పందించడం పై.. తమ అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక గత కొద్ది రోజుల క్రితమే ఉపాసన రామ్ చరణ్ కలిసి హాలిడే ట్రిప్ బాగా ఎంజాయ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆఫ్రికాట్ ఊరికి వెళ్లడంతో ఈ జంట అక్కడ కొన్ని క్రూరమైన మృగాలు మధ్య సఫారీ కూడా చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు.