అనుష్కతో ఎన్టీఆర్ నటించకపోవడానికి కారణం అదేనా...?
అనుష్క తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉండే స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె ఒక్క ఎన్టీఆర్ తో తప్ప అందరితో నటించింది.
కానీ ఎన్టీఆర్ అభిమానులు కూడా అనుష్క- ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రావాలని ఎంతగానో ఎదురుచూశారట.. అలాగే ఇప్పటికీ కూడా ఎదురుచూస్తున్నారు . వెంకటేష్ హీరోగా - అనుష్క హీరోయిన్ గా వచ్చిన చింతకాయల రవి సినిమా లో కూడా ఒక పాటలో ఎన్టీఆర్, వెంకటేష్ మరియు అనుష్క ముగ్గురు కలిసి స్టెప్పులేసినా ఈ సినిమాను మనం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది అని చెప్పలేము. అయితే అనుష్కతో ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాను చేసే అవకాశాన్ని కోల్పోయాడట... అంతేకాదు అలా మిస్ అయిన సినిమా ఏకంగా బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుందట..
అసలు విషయంలోకి వెళితే గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి సినిమాలో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఇందులో గోన గన్నారెడ్డి గా అల్లు అర్జున్ తనదైన శైలిలో నటించి మాస్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాడు. ఈ పాత్రకు ముందుగా డైరెక్టర్ గుణశేఖర్ ఎన్టీఆర్ ను అలాగే మహేష్ బాబు ను కూడా సంప్రదించడం జరిగింది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతో గుర్తింపు రాదనే కారణంతోనే ఆయన సినిమా చేయడానికి ఒప్పుకోలేదట.అంతేకాదు మహేష్ బాబు కూడా సినిమాలో పాత్ర తక్కువగా ఉందన్న కారణంతోనే చేయడానికి ఆసక్తి చూపలేదట. చివరికి ఈ పాత్ర అల్లుఅర్జున్ దగ్గరికి వెళ్లగా.. ఆయన ఓకే చెప్పడం గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించి విపరీతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ పాత్రలో చేసి ఉండి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది అని.. ఆయన ఖాతాలో మరొక హిట్ పడి ఉండేది అని ఆయన అభిమానులు కూడా ఎంతో అనుకున్నారట కానీ ఎన్టీఆర్ నటించకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పూర్తిస్థాయిలో నిరాశ చెందారు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ , గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణం అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా గతంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అంతే కాదు పాన్ ఇండియా లెవెల్ లోనే కథలు వినడానికి సిద్ధంగా ఉన్నాడట..మంచి పాత్ర కథ దొరికితే తప్ప దర్శకుల నుంచి కథ వినడానికి ఎన్టీఆర్ సిద్ధంగా లేరని సమాచారం. బాల రామాయణం సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఎంతో అల్లరి చేసేవాడు అని గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారట..