స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మహేష్.. కారణం..!!
మహేష్ బాబు లుక్ ,డైలాగ్ ,డెలవరి ,బాడీ లాంగ్వేజ్ ఎలా టోటల్గా డైరెక్టర్ పరుశురామ్ డిజైన్స్ చేసినవే అని తెలియజేశారు. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశామని కొన్ని సీన్లు లో చేసే సమయంలో మహేష్ బాబు పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి అని తెలియజేశారు. ఇక స్టోరీ విని ఓకే చెప్పినప్పుడు పరశురామ్ గారు తన ఇంటికి వెళ్లి మూడు గంటల తర్వాత నాకు మెసేజ్ పెట్టాడట.. థాంక్యూ సార్.. ఒక్కడు సినిమాను చూసి డైరెక్టర్ అవుదామని రైలెక్కి హైదరాబాద్ కు వచ్చాను.. నాకు మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు చూడండి ఈ సినిమా ని ఎలా తీసి ఇరగ తీస్తానో అని మెసేజ్ పెట్టారట.
ఈరోజు తన తండ్రి గారి అభిమానులకు, నా అభిమానులకు పరశురామ్ గారు ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయారు సర్కార్ వారి పాట చిత్రం తనతో తీసినందుకు మనస్ఫూర్తిగా థాంక్స్ తెలియజేశారు మహేష్ బాబు. ఈ చిత్రం కోసం కష్ట పడిన వారికి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి చాలా మారిపోయాయి.. తనకు చాలా దగ్గరైన వారు కొంతమంది దూరం అయ్యారు.. ఏం జరిగినా మీ అభిమానం మాత్రం మారలేదు ఇది చాలు నాకు ధైర్యంగా వెళ్లడానికి అని తెలిపారు.