కసిమీదున్న కోలీవుడ్..! కావాల్సింది దక్కుతుందా..?

NAGARJUNA NAKKA
పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ గురించి పెద్దగా చర్చలు జరగని  సమయంలోనే రజనీకాంత్‌, కమల్ హాసన్‌ తమిళ సినిమాకి హిందీలోనూ మార్కెట్‌ సంపాదించిపెట్టారు. అయితే ఈ హీరోలు నెమ్మదించాక విజయ్, అజిత్‌ ఇద్దరూ టాప్‌ రేస్‌ని కమాండ్ చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. అయితే పారితోషికానికి తగ్గట్టుగా మార్కెట్‌ మాత్రం పెంచుకోవడం లేదు.
విజయ్, అజిత్‌ ఇద్దరూ వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. అయితే ఈ హీరోలకి తమిళ్ లో తప్ప బయటి మార్కెట్స్‌లో పెద్దగా స్టార్డమ్‌ లేదు. అజిత్‌ అప్పుడప్పుడు తెలుగు మార్కెట్‌లో మెరిసినా.. ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రమోషనల్ ఈ వెంట్స్‌కి దూరంగా ఉంటున్నట్టే.. మార్కెట్‌ విస్తరణపైనా ఫోకస్‌ చేయలేదు. కానీ రెమ్యూనరేషన్‌ మాత్రం పెంచుతూనే ఉన్నాడు.
అజిత్‌ రీసెంట్‌ సినిమా 'వలీమై'ని తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు మేకర్స్. కానీ ఈ సినిమా తమిళ్‌లో తప్ప అన్ని భాషల్లోనూ ఫెయిల్‌ అయింది. పాన్‌ ఇండియన్‌ లెవల్‌లో హంగామా చేస్తుందనుకున్న థ్రిల్లర్‌ కాస్తా తమిళ మార్కెట్‌కే పరిమితమైంది. రజనీకాంత్‌ తర్వాత వందకోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకున్న హీరోగా ఒక స్పెషల్‌ రికార్డ్‌ సాధించాడు విజయ్‌. అయితే రెమ్యూనరేషన్‌లో దూకుడు చూపించిన విజయ్, మార్కెట్‌ విస్తరణని కొంచెం లేట్‌గా మొదలుపెట్టాడు.  'మాస్టర్' నుంచి తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మళయాళీ, హిందీ భాషల్లోనూ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. అయితే 'మాస్టర్' నార్త్‌లో పెద్దగా రెస్పాన్స్‌ తెచ్చుకోలేదు. ఇక 'కెజిఎఫ్2'కి ముందు రోజు రిలీజైన 'బీస్ట్' అయితే తమిళనాట కూడా హంగామా చేయలేకపోతోంది.
సూర్యకి 'గజిని' తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. అప్పటి నుంచి డబ్బింగ్‌ సినిమాలతో తెలుగునాట హంగామా చేస్తూనే ఉన్నాడు సూర్య. నుంచి తెలుగు మార్కెట్‌ని 'జైభీమ్' సినిమా ఆస్కార్‌ రేసుకి వెళ్లి నేషనల్‌వైడ్‌గా సూర్యకి గుర్తింపు తీసుకొచ్చింది. కానీ ఓటీటీ రిలీజులు 'ఆకాశం నీ హద్దురా, జై భీమ్' తర్వాత థియేటర్లలో దిగిన 'ఈటి' తమిళనాడులో కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ తెచ్చుకోలేదు.
ధనుష్‌ కోలవెర్రి సాంగ్‌తో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యాడు. ఆ తర్వాత 'రాంజానా' సినిమాతో హిందీకి కూడా వెళ్లాడు. ఇప్పుడు వెంకీ అట్లూరి, శేఖర్‌ కమ్ముల సినిమాలతో తెలుగు మార్కెట్‌కి కూడా వస్తున్నాడు. కానీ పాన్‌ ఇండియన్‌ లెవల్‌లో సర్‌ప్రైజ్‌ చేసే హిట్ మాత్రం లేదు. విజయ్‌ సేతుపతికి 'ఉప్పెన' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి తెలుగు డబ్బింగ్‌ మార్కెట్‌పై ఏకాగ్రత పెడుతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: