పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ఎంతలా ప్రేమలో మునిగితేలిన పెళ్లి చేసుకుని ఒక ఇంటి కోడలిగా మారిపోయిన తర్వాత మాత్రం ఏదో తెలియని సంతోషం ఉంటుంది.
పెళ్లి తర్వాత కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉంటారు అందరూ కూడా అందుకే ఒక వయస్సు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలని ఎప్పుడు భావిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మన హీరోయిన్లు పెళ్లి మాట ఎత్తితే చాలు కిలోమీటర్ దూరం పరుగులు పెడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు పెళ్లి గురించి ప్రశ్నించిన ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారట.అలాంటి ముద్దు హీరోహీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మోస్ట్ సీనియర్ హీరోయిన్ గా కొనసాగుతోంది మన అనుష్క శెట్టి. ఇప్పటికే ఈ అమ్మడికి 40ప్లస్ క్రాస్ అయ్యాయి. అయినప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదట ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమా చేస్తోందని సమాచారం..
దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న నయనతార పెళ్లి గురించి ప్రశ్న అడిగితే మాత్రం చిరునవ్వు నవ్వి సమాధానం ఇస్తుందట. 38 చేరువవుతున్న ఈ అమ్మడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.వరుసగా బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ డేటింగ్లో మునిగి తేలుతున్న శృతిహాసన్ 36 ఏళ్లు దాటుతున్నా కానీ ఇక పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదు. పెళ్ళెప్పుడు అని అడిగితే ఇప్పుడే తొందరేముంది అంటూ సమాధానం చెబుతోందట.39 ఏళ్లు దాటిపోయినా సీనియర్ హీరోయిన్ త్రిషా సైతం ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదని సమాచారం. కాగా ఈ అమ్మడుకి ఒకసారి ఎంగేజ్మెంట్ అయ్యి కూడా క్యాన్సిల్ అయింది. అటు వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న 34 ఏళ్ళ నిత్యా మీనన్ కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదు అని చెప్పవచ్చు. తెలుగు హీరోయిన్ అంజలి సైతం 35 ప్లస్ వచ్చిన పెళ్లి చేసుకొని ఒక ఇంటి కోడలిగా మారేందుకు మాత్రం ఆలోచన చేయడం లేదట.
ఇక మరోవైపు హీరోలలో చూసుకుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న ప్రభాస్ కి 42 ఏళ్లు దాటి పోయాయ్ మరి. బాహుబలి 2 తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ ఇప్పటి వరకూ ఆ ఊసే లేదట.38 ఏళ్ళ శర్వానంద్ కూడా పెళ్లి గురించి ఆలోచన అస్సలు చేయడం లేదు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 35 క్రాస్ అవుతున్నా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అనే విషయం చెబుతున్నాడు కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పడం లేదు. 32 ఏళ్ల వరుణ్తేజ్, 33 ఏళ్ల నాగశౌర్య, 36 ఏళ్ల అడవి శేష్ సైతం పెళ్లి గురించి శుభవార్త చెబుతారేమో అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు..