అబ్బా : అదే నిజమైతే ... సాయి పల్లవి గోల్డెన్ ఛాన్స్ కొట్టినట్లే .... ??

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ గా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న వారిలో యువ భామ సాయి పల్లవి కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ లో ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన ఢీ డ్యాన్సింగ్ షో లో తన అద్భుతమైన డ్యాన్సింగ్ టాలెంట్ తో ఆకట్టుకున్న సాయి పల్లవి, ఆ తరువాత తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తీసిన ఫిదా మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. 

ఆ సినిమా అప్పట్లో పెద్ద విజయం అందుకోవడంతో పాటు అందులో సాయి పల్లవి యాక్టింగ్, డ్యాన్స్ లకి మరింత పేరు లభించింది. ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ కొనసాగుతున్న సాయి పల్లవి లేటెస్ట్ గా విరాట పర్వం సినిమా చేస్తున్నారు. రానా హీరోగా నటించిన ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఇటీవల నాని తో కలిసి చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ తో మంచి సక్సెస్ కొట్టిన సాయి పల్లవి లేటెస్ట్ ఒక బడా మూవీ ఆఫర్ అందుకున్నారు అనేది టాలీవుడ్ వర్గాల టాక్. త్వరలో ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయనున్న భారీ పాన్ ఇండియా మూవీలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారని టాక్. 


నిజానికి ఈ సినిమాలో మొదట బాలీవుడ్ నటి అలియా భట్ ని ఎంపిక చేసిన యూనిట్, కొన్ని అనుకోని కారణాల వలన ఆమె మూవీ నుండి తప్పుకోవడంతో పలువురిని పరిశీలించిన టీమ్ ఫైనల్ గా సాయి పల్లవి కి ఓటేశారని, త్వరలో ఈ న్యూస్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే కెరీర్ పరంగా ఈ మూవీ తో సాయి పల్లవి గోల్డెన్ ఛాన్స్ పట్టినట్లే అని, అలానే ఈ మూవీతో ఆమె రేంజ్ మరింతగా పెరగడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుండగా అనిరుద్ రవి చందర్ దీనికి స్వరాలూ సమకూర్చనున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: