ఈసారి త్రిభాషా చిత్రంతో రాబోతున్న సాయిపల్లవి.. పోస్టర్ వైరల్..!!

Divya
ఫిదా చిత్రంతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ఆ తర్వాత తన సహజమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది. అందం, అభినయంతో పాటు గా డాన్స్ తో ప్రేక్షకులను బాగా మరిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఉంటుంది. అందుచేత నేతను చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఇక గత సంవత్సరం శ్యామ్ సింగరాయి, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. త్వరలోనే ఈమె నటించిన విరాట పర్వం సినిమా కూడా విడుదల కాబోతుంది.

అయితే ఈ రోజున సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న గార్గి  చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో ఎప్పట్లాగానే సాయి పల్లవి సాంప్రదాయమైన చీరకట్టులో భుజాన ఒక బ్యాగ్ తగిలించుకొని సాధారణ అమ్మాయి గా కనిపిస్తోంది సాయి పల్లవి దేని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు గా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో న్యాయదేవత కూడా బొమ్మ కనిపిస్తుంది.

ఇక ఈ మేకింగ్ వీడియోలో నువ్వు టైమ్ రాత విధి.. అంటూ చెప్పే డైలాగ్స్ సాయి పల్లవి కనిపిస్తుంది. గారికి ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సాయి పల్లవి ఈ చిత్రంలో అందరినీ ఎదిరించి ఏదో న్యాయం కోసం పోరాడుతున్నట్లు గా కనిపిస్తోంది. ఇక సాయి పల్లవి ఈ చిత్రంలో మరొక విలక్షణమైన పాత్రలో కనిపించబోతోందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం రామచంద్రం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించబడింది ఉన్నామని చిత్రబృందం తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: