సీక్వెల్ సెంటిమెంట్.. ఎఫ్ 3 కష్టమే!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల సీక్వెల్ సినిమాలు తెరకెక్కడం విరివిగా జరుగుతున్నాయి. పెద్ద హీరోలు సైతం తాము నటించిన సినిమాలకు సీక్వల్స్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది హీరోలు ఈ విధంగా చేస్తూ ఉంటే మరి కొంతమంది హీరోలు సైతం ఈ తరహా సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎఫ్3 సినిమా పై ఫ్యామిలీ అభిమానుల లలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఎఫ్2 చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సీక్వెల్ రావాలనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి మొదలు కాగా వారి ఆసక్తిని గమనించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే పని మొదలు పెట్టారు. అలా ఈ చిత్రాన్ని ఇప్పుడు పూర్తిచేసి మే 27వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. 

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయింది. ఎంతో ఫన్ తో నిండి ఉండటంతో తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కి వచ్చారు చిత్ర యూనిట్. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో వస్తుంది. అయితే గత కొన్ని సినిమాలుగా సీక్వెల్ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోని నేపథ్యంలో ఈ సినిమాలు కూడా ఆ తరహాలోనే ఆకట్టుకోకుండా ఉంటుందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. మరి రెగ్యులర్ సినిమాలకంటే భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏ విధమైన ఫలితాన్నీ అందుకుంటుందో చూడాలి. కామెడీ సినిమాలను బాగా తెరకెక్కించే అనిల్ రావిపూడి ఈ సినిమా ను ఎలా డీల్ చేశాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: