టాలీవుడ్ స్టార్
హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే దేశభక్తి సినిమాను కూడా రూపొందించారు.26/11
ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్
సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన
సినిమా ఇది.ఈ సినిమాలో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.'గూఢచారి' ఫేమ్ శశికిరణ్
తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన
బాలీవుడ్ యంగ్
బ్యూటీ సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో
తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల నటించింది.
జూన్ 3 వ తేదీ న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ
సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్
ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా
మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మహేష్ బాబు. అలానే 'మేజర్' సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. ఇక ఈ
సినిమా మొదలై చాలా కాలమవుతుంది.
కోవిడ్ 19 సమయంలో 'మేజర్'
సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. నిజానికి ఈ సినిమాకి క్రేజీ ఓటీటీ ఆఫర్ వచ్చిందని చెప్పారు
సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన
సినిమా అని.. అందుకే భారీ ఓటీటీ ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేసినట్లు చెప్పారు.అలాగే టాలెంటెడ్
హీరో శేష్ కూడా తన
హిందీ డెబ్యూ ఫిల్మ్ పాన్
ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వాలని కోరుకున్నట్లు చెప్పుకొచ్చారు. సోమవారం నాడు విడుదలైన
సినిమా ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తోంది. ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆశించిన స్థాయిలో
సినిమా ఎలా
సక్సెస్ అవుతుందనేది చూడాలి!