బాలీవుడ్ దారుణ పతనానికి కారణమిదే ?
అక్కడే కథ అడ్డం తిరిగింది, మాకు సినిమాలు లేకపోయినా పర్వాలేదు. కానీ మళ్ళీ మళ్ళీ అదే అర్బన్ డ్రామా కథల్ని చూడమని ఉండిపోతారు. దీంతో ఈ మధ్య కాలంలో రెండు మూడు హిందీ చిత్రాలు తప్ప ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అగ్గికి ఆజ్యం పోసినట్లు అక్కడ వారు తమ చిత్రాలను ఆదరించడం లేదు అనుకుంటుంటే దక్షిణాది చిత్రాలు అక్కడ డబ్ అయి ఘన విజయాలను అందుకుంటున్నాయి. భాష ఏదైనా కొత్తదనాన్ని ఎంజాయ్ చేస్తూ సౌత్ చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు హిందీ ప్రేక్షకులు. అయితే ఇక్కడ తేడా ఏమిటి అంటే... దక్షిణాది చిత్రాల్లో ఇపుడు క్రియేటివిటీ ఎక్కువగా ఉంటున్నాయి. కమర్షియల్ చిత్రాలకు ఇప్పుడు ఫ్యూచర్ ఎక్కువగా ఉంది.
ఈ రకమైన సినిమాలు తీసే దర్శక హీరోలు బాలీవుడ్ లో కరువయ్యారు. కేవలం సల్మాన్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ లు మాత్రమే ఈ తరహా సినిమాలు చేస్తున్నారు. యాక్షన్, మంచి డ్రామా, కామెడీ, సెంటిమెంట్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దక్షిణాది చిత్రాలు తెరకెక్కుతుండటంతో హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇపుడు హిందీలో ఈ తరహా చిత్రాల సంఖ్య ఎక్కువయితే తప్ప అక్కడ మళ్ళీ బాలీవుడ్ సినిమాలకు మళ్ళీ డిమాండ్ పెరిగేలాలేదు.