యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా అధికారికంగా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొరటాల శివ ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు కొరటాల శివ కొంత మంది హీరోయిన్లను అనుకున్నట్లుగా తెలుస్తోంది.
అందులో భాగంగా మొదట ఆలియా భట్ ను , కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు ఈ ముద్దుగుమ్మ కూడా ఓకే చెప్పిన తర్వాత అనూహ్యంగా ఈ సినిమా నుండి చివరి నిమిషంలో తప్పుకుంది. ఆ తర్వాత ఈ సినిమాలో రష్మిక మందన నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన కీయారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీకి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ బడ్జెట్ 150 కోట్లు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా ఈ రేంజ్ బడ్జెట్ మూవీ లో చేయడం ఇదే మొదటి సారి అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న తాజా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెట్టుకున్నారు.