టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.
తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న సమంత తన గ్లామర్ లుక్ తో మాత్రం కుర్రాళ్ల హృదయాలను బాగా దోచుకుంది. అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను ఆమె సంపాదించుకుంది.
తొలిసారిగా సమంత ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను నుండి మంచి మార్కులు సంపాదించుకుంది. అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా కొంత ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లిందనే చెప్పవచ్చు.చాలా వరకు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సినిమాల్లోనే నటించింది.
ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. విడిపోయిన విషయం కూడా తెలిసిందే. నిజానికి పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పాలి.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుందట.వెండితెరపైనే కాకుండా ఓటీటీ ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడాఆమె హోస్టింగ్ చేసింది. సొంతంగా వ్యాపారాలు కూడా ఆమె ప్రారంభించింది. పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నిలిచిందట.
అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పెళ్లి జీవితానికి ముగింపు పలికిందట సమంత. దీంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది.చాలా వరకు సమంత పైనే అందరూ విమర్శలు చేశారు. ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో వారు బిజీగా మారారు. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారిపోయింది సమంత. తనకు అక్కినేని ఫ్యామిలీతో సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పవచ్చు. పొట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో అందర్నీ కూడా తన వైపు మలుపుకుంటుంది. పైగా అవకాశాలు కూడా బాగా అందుకుంటుంది. అటు టాలీవుడ్, కోలివుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ దృష్టి పడిపోయిందట. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం సమంత కోసం తెగ ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.
ఇక సమంత తన ఫ్రెండ్స్ తో కూడా తెగ చిల్ అవుతూ ఉంటుంది. వారితో కలిసి ట్రిప్స్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకుందట. అందులో తనను తన ఫ్రెండు మిస్ అవుతున్నట్లు పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ను సమంత రీ పోస్ట్ చేస్తూ.. నిన్ను ఆల్రెడీ మిస్ అయిపోతున్నాను త్వరగా వచ్చేయ్ అంటూ పంచుకుందట ప్రస్తుతం ఆమె పంచుకున్న స్టోరీ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.