మరో ఇంట్రెస్టింగ్ చిత్రంతో రాబోతున్న యువహీరో..!!
శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఎల్. ఎల్. పి. ప్రొడక్షన్ నెంబర్ -5 గా మోహన్ రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం తెలుగు , హిందీ భాషలలో రూపొందించడం జరుగుతోంది. ఈ చిత్రం సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో తన టాప్ క్లాస్ నటనతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాడు సుధీర్ బాబు
ఈ చిత్రానికి మామ మచ్చింద్ర.. అనే ఒక టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. మచ్చింద్ర అంటే పవర్ ని కోరుకునే వాడు, దైర్యవంతుడు అని అర్థాలు వస్తాయట. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఒక చాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా డైరెక్టర్ హర్షవర్ధన్ మల్టీ షేడ్ క్యారెక్టర్ లో సుధీర్ బాబు ని చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రంలో ప్రముఖ నటి నటులు సైతం కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా అత్యున్నత టెక్నికల్ టీం వర్క్ కూడా చేయబోతోంది అన్నట్లుగా సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.