కరోనా బారిన పడ్డ మెగా కోడలు..!!

Divya
కరొనా ఇంకా పూర్తిగా అంతం కాలేదని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఇది మన చుట్టూనే తిరుగుతూ ఉందనే చేదు నిజాన్ని మనం ఇంక మర్చిపోలేక ఉన్నాము. ఇప్పుడు తాజాగా హీరో రామ్ చరణ్ భార్య ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉపాసన కొణిదెల ఈ విషయాన్ని తెలియ జేసింది. తాను ఈ మహమ్మారి బారిన పడినట్లుగా ఆమె తెలియజేసింది. ప్రస్తుతం కరోనా నుంచి కోరుకుంటున్నట్లుగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటుంది ఉపాసన. ముఖ్యంగా కరొనా ఫస్ట్ వేవ్ లో ఇబ్బందులు పడ్డ వారికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా తెలియజేస్తూ ఉంటుంది.

 కరోనా బారిన పడితే ఎలాంటి మందులు ఉపయోగించాలి వాటికి సంబంధించి వీడియోలను తెలియజేస్తూ ఉంటుంది. ఇక కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అయితే తర్డ్ వేవ్లో మాత్రం అంతగా ప్రాణాపాయం ఏమీ జరగలేదు కానీ.. కానీ కరోనా మాత్రం పూర్తిగా మాయమైందని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో కరోనా బారిన పడిన విషయాన్ని ఉపాసన బయట పెట్టడం జరిగింది.
గడిచిన వారం నుంచి తను కోవిడ్ బారిన పడినట్లుగా తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకున్న కూడా స్వల్ప లక్షణాలు రావడంతో తనకు సందేహం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలి నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి పారాసిట్మల్ విటమిన్ టాబ్లెట్ వేసుకోమని వైద్యులు సూచించడంతో వాటిని పాటిస్తున్నారు అని తెలియజేశారు. ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా కూడా చాలా ధైర్యంగా ఉన్నానని. కోవిడ్ మళ్ళీ పంజా విసరడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ తెలియజేసింది. ఇక చెన్నైలో ఉన్న తన తాతయ్య ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసింది. ఈ విషయం టెస్టులు చేయించుకోకపోతే ఎవరికీ తెలిసేది కాదని ఆమె తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: