టాలీవుడ్
హీరో శ్రీకాంత్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ తన కెరియర్ ను చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి ఆ తర్వాత తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించి హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు.
హీరో గా అవకాశాలు దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
ఎక్కువ శాతం
శ్రీకాంత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లలో , ప్రేమకథా సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలా ఎన్నో విజయవంతమైన
సినిమా లతో
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న
శ్రీకాంత్ ఈ మధ్య కాలంలో మాత్రం హీరోగా విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనుకబడి పోయాడు. హీరోగా విజయాలను అందుకోవడంలో వెనుకబడిపోయిన
శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ పాత్రలలో మరియు ఇతర పాత్రలలో నటిస్తూ కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణ హీరోగా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో
శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ
సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా
శ్రీకాంత్ కు ప్రతినాయకుడిగా మంచి గుర్తింపును కూడా తీసుకువచ్చింది.
ఇలా అఖండ సినిమాలో ప్రతినాయకుడి పాత్రతో ఎంతో మందిని ఆకట్టుకున్న
శ్రీకాంత్ మరో క్రేజీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నాడు. కోలీవుడ్ స్టార్
విజయ్ హీరోగా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఒక
సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ
సినిమా కెరియర్ పరంగా
విజయ్ కి 66 వ సినిమా. తాజాగా ఈ సినిమాలో
శ్రీకాంత్ నటించబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. మరి ఈ
సినిమా ద్వారా
శ్రీకాంత్ ఏ రేంజ్ క్రేజ్ ను అందుకుంటాడో చూడాలి.