ఆ నిర్మాత వల్లే 5 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశానంటున్న సునీత..!!
మరొకసారి గీతా ఆర్ట్స్ అల్లు ఎంటర్టైన్మెంట్ వారు సీరియల్స్ లో అవకాశాలు రాకుండా చేశారు అని కూడా ఆమె ప్రస్తావించింది. ఇకపోతే ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఏమిటి అనే విషయానికి వస్తే.. ఇంత పెద్ద గొడవ జరిగిన తరువాత తనకు ఎక్కడ సినిమా అవకాశాలు రావు.. అలాగే సీరియల్స్‌లో కూడా అవకాశాలు రావు. ఇక మూడేళ్ల నుంచి ఒక అమ్మాయి ఒక ప్రొడ్యూసర్ పై ఇంత పోరాటం చేస్తోంది అంటే నిప్పు లేనిదే పొగ రాదు అని గమనించాలి.. అల్లు వారి గీతా ఆర్ట్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలో మరో పెద్ద బ్యానర్ నుంచి కూడా సినిమా అవకాశాలు వస్తాయనే నమ్మకం తనకు లేదని. తనకు ఎవరూ ఛాన్స్ ఇవ్వరు అని వేధించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురై ఆమె మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా ఎమోషనల్ అయ్యింది. దీనికి ఆధారాలు కావాలంటే 2019 నుంచి ఇప్పటివరకు యూట్యూబ్ లో వచ్చిన అన్ని లింకులో చూడవచ్చు అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.