అందాల ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి మంజ్రేకర్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. గని మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సాయి మంజ్రేకర్ మాత్రం తన నటనతో, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయి మంజ్రేకర్ 'మేజర్' సినిమాలో నటించింది. మేజర్ మూవీ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ మూవీ లో మేజర్ సందీప్ పాత్రలో హీరో అడివి శేష్ నటిస్తున్నారు. మేజర్ మూవీ ని హేష్ బాబు,ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మేజర్ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు పాల్గొని ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే మేజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా అడవి శేషు మరియు సాయి మంజ్రేకర్ తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ కి గెస్ట్ లుగా వెళ్లారు.
ఈ ప్రోగ్రాం లో భాగంగా సాయి మంజ్రేకర్ కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మహేష్ బాబును కలిశారు కదా మహేష్ బాబు ఏం అడిగారు అనే ప్రశ్న ఎదురయింది... ఆ ప్రశ్నకు సాయి మంజ్రేకర్ సమాధానమిస్తూ... మహేష్ బాబు ను ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మొదటి సారి కలిశాను అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు ను చూడగానే తన తదుపరి మూవీలో ఛాన్స్ ఇవ్వమని అడిగారా అనే ప్రశ్న సాయి మంజ్రేకర్ కు ఎదురు అయింది ... ఆ ప్రశ్నకు సాయి మంజ్రేకర్ సమాధానమిస్తూ... తన సినిమాలో అవకాశం ఇవ్వమని అడగలేదు కానీ తన అందం సీక్రెట్ అడిగాను అని చెప్పుకొచ్చింది.