సర్కారు వారి పాట విడుదలై 4 రోజులు అవుతున్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. తొలి రోజు నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. అందుకే ఈ సినిమాకు కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కొంతమంది యాం టీ మహేష్ అభిమానులు ఈ సినిమా డిజాస్టర్ అనే విధంగా వార్తలు ప్రచారం చేశారు 50 శాతం వారు ఈ సినిమా డిజాస్టర్ అని ప్రచారం చేయడంలో సఫలీకృతం అయ్యారు కూడా.
చాలా మంది ఈ సినిమా డిజాస్టర్ అనుకున్నారు కానీ అనూహ్యంగా మహేష్ అభిమానులు ఈ చిత్రం డిజాస్టర్ కాదు సూపర్ హిట్ అని ప్రజలందరికీ చేరవేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి బాగానే ఉందని చెబుతున్నా కూడా సినిమాను డౌ ట్ చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది యాంటీ మహేష్ అభిమానులు ఈ విధంగా ప్రచారం చేయగా మహేష్ అభిమానులు మాత్రం వారందరిని తిప్పి కొడుతూ సోషల్ మీడియా లో ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చేలా చేశారు.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కగా ప్రతి ఒ క్క ప్రేక్షకుడు కూడా ఈ సినిమాలు చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫాన్స్ వార్ లో చిత్ర నిర్మాత ఎంతో నష్టపోతున్నాడో చెప్పాలి. బా గున్నా సినిమాలు కూడా ఈ విధంగా బాగోలేదని ప్రచారం చేయడం పట్ల ఎటువంటి లాభం అందుకుంటారో తెలియడం లేదు. మరి భవిష్యత్తులోనైనా ఇటువంటి నెగిటివ్ ప్రచారా లు చేయడం ఆపేస్తారా.. హీరోలకు ఇది పెద్ద తలనొప్పిగా మారిన విషయం అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈ సినిమా భవిష్యత్ లో ఇంకా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.