అలా
బాహుబలి మూవీ తో పాన్
ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న
ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్
ఇండియా సినిమాలలో, అంతకుమించిన రెండు సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే
ప్రభాస్ 'బాహుబలి'
సినిమా తర్వాత సాహో, రాధే
శ్యామ్ సినిమాలో నటించాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా
బాహుబలి రేంజ్ విజయాలను మాత్రం
ప్రభాస్ కు బాక్సాఫీస్ దగ్గర తెచ్చి పెట్టలేక పోయాయి. ఇది ఇలా ఉంటే
ప్రభాస్ ప్రస్తుతం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
ప్రభాస్ సరసన
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ
సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయ్యింది. సలార్
సినిమా నెక్స్ట్ షెడ్యూల్ 17 మే 2022 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలక నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ఈ సినిమాతో పాటు
ఆది పురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. అలాగే
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్
మూవీ లో కూడా
ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వెలువడి చాలా కాలం అవుతుంది.