మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కుర్ర హీరో లకు ఏ మాత్రం తీసిపోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. అందులో భాగంగా చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్150 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీ లో నటించిన చిరంజీవి ఈ మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా కలెక్షన్ లను కూడా ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే రాబట్టాడు.
ఇలా రీ ఎంట్రీ తర్వాత రెండు వరుస విజయా లతో ఫుల్ ఫామ్ లో ఉన్న చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే రీ ఎంట్రీ తర్వాత రెండు వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ తో మాత్రం విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ , బోలా శంకర్ , బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూడు సినిమాలకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమాకు జరిగే బిజినెస్, సినిమాకు వచ్చిన లాభాలను బట్టి చిరంజీవి రెమ్యునిరేషన్ ను తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆచార్య సినిమాకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఇదే ఫార్ములా ను అప్లై చేశాడట. మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ విషయం లో పాటిస్తున్న ఫార్ములాకు నిర్మాతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.