ఓహో.. సుధీర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా ప్లాన్ చేసారా?
ఈ క్రమం లోనే బుల్లితెర ప్రేక్షకులూ సుడిగాలి సుదీర్ ని అమితంగా అభిమానిస్తూ ఉంటారు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా డాన్సర్ గా మెజీషియన్ గా యాంకర్ గా కూడా అదరగొడుతున్నాడు సుడిగాలి సుదీర్. ఇకపోతే మరికొన్ని రోజుల్లో సుడిగాలి సుధీర్ బర్త్ డే రాబోతుంది అన్న విషయం తెలిసిందే. మే 17వ తేదీన సుడిగాలి సుదీర్ 35 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే అభిమానులందరూ సుదీర్ బర్త్ డే ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇలాంటి సమయంలోనే సుడిగాలి సుదీర్ బర్త్ డే కు సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించేందుకు ఈ టీవీ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సుధీర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ప్లాన్ చేశారు అనేది తెలుస్తుంది. ఇక ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. ఒకసారి ఈ ప్రోమో చూసుకుంటే ఏకంగా ఎంతోమంది సుడిగాలి సుదీర్ బర్త్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ కనిపిస్తారు. ఇక ఆ తర్వాత సుదీర్ రిక్షా తొక్కుతూ కనిపిస్తాడు. దీనికి సంబంధించి ఫుల్ ప్రోమో కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్..