కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు అయిన
శివ కార్తికేయన్ తాజాగా కాలేజ్ డాన్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
శివ కార్తికేయన్ సరసన
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటించగా , ఈ సినిమాకు సీబీ
చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య , సముద్ర కని ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాపై మొదటి నుండి తమిళనాడు లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం కాలేజ్ డాన్ సినిమాకు ఎలాంటి ప్రచారాలను చేయకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కాలేజ్ డాన్
మూవీ కి ఎలాంటి ప్రచారాలు లేకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేసినప్పటికీ కాలేజ్ డాన్
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ
సినిమా కలెక్షన్లలో రోజు రోజుకు గ్రోత్ కనిపిస్తూ వస్తుంది. ఇప్పటివరకు నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న
శివ కార్తికేయన్ 'కాలేజ్ డాన్'
సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.
తమిళనాడులో నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ కి గాని
శివ కార్తికేయన్ 'కాలేజ్ డాన్' మూవీ 33.60 కోట్ల కలెక్షన్లను సాధించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలేజ్ డాన్
మూవీ నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తయ్యేసరికి 1.20 కోట్ల కలెక్షన్లను సాధించింది.
కర్ణాటకలో నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను
శివ కార్తికేయన్ 'కాలేజ్ డాన్'
మూవీ 2.45 కోట్ల కలెక్షన్లను సాధించింది.
కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసేసరికి
శివ కార్తికేయన్ 'కాలేజ్ డాన్'
మూవీ 0.95 కోట్ల కలెక్షన్లను సాధించింది.
ఓవర్సీస్ లో కాలేజ్ డాన్
మూవీ నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి దాదాపుగా 11.30 కోట్ల కలెక్షన్లను సాధించింది.
నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి
శివ కార్తికేయన్ కాలేజ్ డోన్
మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 కోట్ల మేర కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది.