హీరోయిన్ పూర్ణకి కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆమెకు అందం ఉంది, అభినయం ఉంది, కానీ ఛాన్స్ లు మాత్రం అంతగా రావడం లేదు. నిజానికి 'అఖండ'తో ఈ హోమ్లీ బ్యూటీకి ఘన విజయం అయితే వచ్చింది
కానీ, పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం పూర్ణకి ఇంకా రాలేదట.'అఖండ' సినిమా రిలీజ్ అయి నెలలు అవుతుంది . అయినా. పూర్ణను ఇప్పటివరకు మరో సినిమాలో ఎవ్వరూ కూడా పెట్టుకోలేదు. సినిమా చేసే ఆసక్తి ఆమెకు ఉన్నా.. ఎవరూ ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు. నిజానికి ఒక భారీ హిట్ పడితే.. వెంటనే హీరోయిన్లకు భారీగా అవకాశాలు కూడా వస్తాయి. కానీ, ఎంత పెద్ద హిట్ వచ్చినా.. పూర్ణ ఫేట్ మాత్రం అస్సలు మారడం లేదు.
అయితే, పూర్ణకి ఛాన్స్ లు రాకపోవడానికి ప్రధాన కారణం.. ఆమె తన రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిందని తెలుస్తుంది.ప్రస్తుతం పూర్ణ ఒక్కో సినిమాకు 50 లక్షల పైనే డిమాండ్ చేస్తోందని సమాచారం.'అఖండ'లాంటి భారీ విజయం వచ్చాక కూడా, తాను 20 లక్షలే తీసుకుంటే.. అది తన విజయానికే అవమానం అంటుందట ఈ బొద్దుగుమ్మ l. మొత్తమ్మీద పూర్ణ 50 లక్షలు పారితోషికం తీసుకోవాలని ఎంతో బలంగా ఫిక్స్ అయ్యింది.
అసలు పూర్ణను చిన్న నిర్మాతలు మాత్రమే తీసుకుంటారు. వాళ్ళు మేము అంత ఇవ్వలేం అని అంటే.. ఎందుకు ఇవ్వరు ? అనేది పూర్ణ ప్రశ్నట. ఇద్దరు కొత్త నిర్మాతలు చిన్న సినిమా ఆఫర్లతో వచ్చినా ఆమె రెమ్యునరేషన్ విషయంలో నచ్చక, ఆ సినిమాలను ఒప్పుకోలేదట.. ఎట్టిపరిస్థితుల్లో 50 లక్షలకు తగ్గను అంటుందట.. మరి పూర్ణ డిమాండ్లకు ఓకే చెప్పే నిర్మాతలు ఉన్నారా ? ఇప్పటికే పూర్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదిహేను ఏళ్ళు పూర్తి అవుతుంది.
ఈ పదిహేను ఏళ్ళల్లో ఆమె ఎన్నడూ 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేదట.. అందుకే, ఎలాగైనా ఇప్పుడు అయినా 50 లక్షలు అందుకోవాలని తెగ ముచ్చట పడుతుంది. మరి పూర్ణ ముచ్చట తీర్చే నిర్మాత ఎవరు అనేది మాత్రం చూడాలి. నిజానికి పూర్ణకి అన్నీ ఉన్నాయి. కానీ అదృష్టం ఒక్కటే లేదు. పైగా పూర్ణకి దర్శకులను ఎలా ఆకట్టుకోవాలి ? అలాగే వాళ్లను ఎలా మెప్పించాలి ? లాంటి విషయాలు కూడా బాగానే తెలుసు.
కాకపోతే, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది పూర్ణ పరిస్థితి. తాను ఎంతగా భారీగా అందాల ఆరబోసినా ఆమెకు మాత్రం ఐటమ్ సాంగ్స్, సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు గానీ, హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ లు అస్సలు ఇవ్వలేదు. ఆ మాటకొస్తే అఖండ సినిమాలో ఆమెది సైడ్ క్యారెక్టర్ అయినా ఈ ఫేడ్ అవుట్ భామ.. డబ్బు విషయంలో అసలు తగ్గేదే లే అంటుందట.