కోలీవుడ్ స్టార్
హీరో దళపతి విజయ్ తమిళనాడులో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లతో ఫుల్
జోష్ లో వున్న
విజయ్ కి ఈమధ్య ఒక అట్టర్ ఫ్లాప్ తగిలింది. అదే నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'బీస్ట్' మూవీ. ఎన్నో భారీ అంచనాలతో పాన్
ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ
సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక
బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.అయినా కానీ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు ఈ
సినిమా దర్శకుడు నెల్సన్. త్వరలోనే
కోలీవుడ్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్‌తో తన తదుపరి సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. 'తలైవా 169' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో
హీరోయిన్ ఎవరని ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. 'రోబో'
సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించబోతుందనే వార్తలు బాగా వినిపించాయి. అయితే ఈ ఆఫర్‌కు
ఐశ్వర్య రాయ్ నో చెప్పినట్లు సమాచారం తెలుస్తుండగా.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో విజయ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందు వలనే 'బీస్ట్'
మూవీ ఫ్లాప్ అయినా కూడా ఓ మోస్తారు మంచి కలెక్షన్లను రాబట్టింది. కానీ ఇతర భాషల్లో మాత్రం ఈ
సినిమా భారీ నష్టాలు మిగిల్చి వాష్ అవుట్ అయ్యి బోల్తా పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే
రజినీ కాంత్ తో నెల్సన్
సినిమా ఏ విధంగా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే
ఐశ్వర్య రాయ్ ఈ సినిమాకు నో చెప్పిందా? లేదంటే మరేదైనా కారణం అనేది ఉందా? అని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం
ఐశ్వర్య రాయ్ తన ఫేవరెట్
డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.