టాలీవుడ్ యంగ్ టైగర్
ఎన్టీఆర్ హీరోగా అతి త్వరలో
కొరటాల శివ మూవీ పట్టాలెక్కనున్న విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ కెరీర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీని
ఎన్టీఆర్ ఆర్ట్స్,
యువ సుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మించనుండగా అనిరుద్ దీనికి సంగీతం అందించనున్నట్లు టాక్ మంచి యాక్షన్ తో పాటు
మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉండేలా దర్శకుడు
కొరటాల శివ ఈ
మూవీ స్టోరీ ని ఎంతో అద్భుతంగా రాసుకున్నట్లు సమాచారం.
గతంలో వీరిద్దరికి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్
మూవీ ఎంతో పెద్ద
సక్సెస్ కొట్టడంతో ఈ
మూవీ పై అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ
మూవీ తరువాత బుచ్చి బాబు సనా,
ప్రశాంత్ నీల్ లతో కూడా వర్క్ చేయనున్నారు ఎన్టీఆర్. మరోవైపు ఈ దర్శకులు ఇద్దరూ కూడా
ఎన్టీఆర్ కోసం స్టోరీ లు ఆల్మోస్ట్ సిద్ధం చేసి, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే, ఎల్లుండి
ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో
కొరటాల అలానే
ప్రశాంత్ నీల్ సినిమాల యొక్క ఫస్ట్ లుక్ అప్ డేట్స్ రానున్నట్లు సమాచారం.
ఈ రెండు సినిమాల కోసం ఇప్పటికే తన మేకోవర్ లో చేంజెస్ చేసి సిద్దమైన
ఎన్టీఆర్, వాటికి సంబంధించి మొన్న ప్రత్యేకంగా ఫోటో షూట్స్ చేసారని, బర్త్ డే రోజున ఈ రెండు సినిమాల యొక్క అప్డేట్స్ రానున్నాయని
టాలీవుడ్ వర్గాల టాక్. ఇక
ప్రశాంత్ నీల్ సినిమా కూడా పక్కాగా సాగె
మాస్ మూవీ అని ఈ సినిమాలో
ఎన్టీఆర్ పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో ఉండనుందని టాక్. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే
ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కి ఏకంగా రెండు పండుగలన్నమాట. మరి ఈ సినిమాలు ఆయనకు ఎంత మేర
సక్సెస్ అందిస్తాయో చూడాలి.