టాలీవుడ్ టాలెంట్ దర్శకులలో ఒకరు అయిన సుకుమార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్య సినిమాతో దర్శకుడిగా కెరియర్ ని మొదలు పెట్టిన సుకుమార్ మొదటి సినిమా తోనే దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు గా సుకుమార్ కోనసాగుతున్నాడు.
సుకుమార్ తాజాగా దర్శకత్వం వహించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుకుమార్ టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరు ఆయన రాజశేఖర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా శేఖర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శేఖర్ మూవీ కి జీవిత దర్శకత్వం వహించింది. ఈ సినిమా మే 20 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటం తో తాజా గా శేఖర్ చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.
శేఖర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుకుమార్ అందులో భాగంగా రాజశేఖర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సుకుమార్ శేఖర్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ... ఆహుతి, ఆగ్రహం, అంకుశం వంటి సూపర్ హిట్ మూవీ లను చూసి రాజశేఖర్ కు నేను వీరభిమానిని అయ్యాను. రాజశేఖర్ సినిమాలు చూసి సినిమాకు సంబంధించి నేను కూడా చేయగలననే కాన్ఫరెన్స్ నాకు వచ్చింది. ఊరిలోను , స్కూల్లోనూ రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసేవాడిని అని సుకుమార్ తెలియజేశాడు.