ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పీరిట్
మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
ప్రభాస్ సరసన
హీరోయిన్ గా కీయారా అద్వానీ నటించబోతోంది అని కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్న ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే.
అయితే తాజాగా
ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే స్పిరిట్
మూవీ లో
కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోంది అని వస్తున్న వార్తలపై
కియారా అద్వానీ తరఫు అధికార ప్రతినిధి స్పందించారు.
ప్రభాస్ హీరోగా
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్
సినిమా కోసం తమని ఎవరూ ఇంత వరకూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. అందువలన స్పిరిట్
మూవీ లో కియారా అద్వానీ నటిస్తుంది అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. కీయారా అద్వానీ చేసే కొత్త ప్రాజెక్ట్ ల వివరాలను అధికారికంగా తెలియజేస్తామని అన్నారు.