టాలీవుడ్
ఇండస్ట్రీ మోస్ట్ క్రేజీ
హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
సమంత ఇప్పటికే యశోద, శాకుంతలం
సినిమా పనులను ముగించుకుంది. ఈ సినిమాలు మరికొంత కాలంలో విడుదల కాబోతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా
సమంత ,
విజయ్ దేవరకొండ హీరోగా
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
ఖుషి సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను మరియు విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.
చిత్ర బృందం ప్రకటించిన ఈ ఫస్ట్ లుక్
పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే ఈ సినిమాను తెలుగు , తమిళ, మలయాళ ,
కన్నడ భాషల్లో 23
డిసెంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా
ఖుషి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. ఖుషి సినిమాను దర్శకుడు
శివ నిర్వాణ అద్భుతమైన ఎమోషనల్ కలిగిన
ప్రేమ కథ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా
హీరో హీరోయిన్ల మధ్య మంచి ఎమోషనల్
జర్నీ జనరేట్ కావడం కోసం దర్శకుడు శివ నర్వాణ ఈ సినిమాలో ఒక లిప్ లాక్ సన్నివేశాన్ని క్రియేట్ చేసినట్లు, అందులో భాగంగా
విజయ్ దేవరకొండ, సమంత మధ్య
ఖుషి సినిమాలో ఒక అదిరిపోయే లుక్ లాక్ సన్నివేశం ఉండనునట్లు, ఆ లిప్ లాక్ సీన్ ఈ సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్ను కోరి , మజిలి వంటి
ప్రేమ కథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన
శివ నిర్వాణ ఖుషి సినిమాకు దర్శకత్వం వహించడం, ఈ
సినిమా కూడా ప్రేమకథతో తెరకెక్కడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.