కింగ్ ఆఫ్ ఎలివేషన్
ప్రశాంత్ నీల్ ఇంకా
కింగ్ ఆఫ్ ఎమోషన్స్
కొరటాల శివ అలాగే
కింగ్ ఆఫ్ ఎనర్జీ
ఎన్టీఆర్ అంటేనే
మాస్ కాంబినేషన్.రెండు వరుస ఊరమాస్ సినిమాలతో రాబోతున్నాడు..పైగా ప్రకటించిన ఈ రెండూ పెద్ద పాన్
ఇండియా ప్రాజెక్టులే.. ఇక
ఎన్టీఆర్ నుంచి వినిపించిన డైలాగూ అల్ట్రా మాస్.. ఇంకా కత్తులూ, గొడ్డళ్లు రక్తం, మట్టి ఇంకా సముద్రం.. ఇలాంటి ఎలిమెంట్స్ చూపించి ప్రిలుక్ ఇంకా ఫస్ట్ లుక్ తో ప్రకంపనాలు రేపుతున్నాడు.. బ్యాక్ టు బ్యాక్ పాన్
ఇండియా సినిమాలు చేసి దేశావ్యాప్తంగా ప్రభంజనం సృష్టించబోతున్నాడా? అంటే అవుననే స్పష్టంగా అర్ధం అవుతుంది.పాన్
ఇండియా సక్సెస్ కొట్టిన
మాస్ డైరెక్టర్
ప్రశాంత్ నీల్, ఊరమాస్
హీరో ఎన్టీఆర్ ఇద్దరూ
కేజిఎఫ్ 2 ఇంకా ట్రిపుల్ ఆర్… వేరు వేరు సినిమాలతో పాన్
ఇండియా లెవల్ లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించారు.
వీళ్లిద్దరూ కూడా కలిసి
సినిమా చేస్తే ఎలాంటి ప్రభంజనాలు సృష్టించబడుతాయో అని
తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. సరిగ్గా
ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్
పోస్టర్ రిలీజ్ చేసి ఇంకా ఊహల్లో తేలిపోయిన ఫ్యాన్స్ ని, పూనకాలతో ఊగిపోయేలా చేశారు.
కేజిఎఫ్ ఫ్రాంచైజీ కూడా అనౌన్స్ కావడంతో
ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో
ఎన్టీఆర్ సినిమా ఇప్పుడప్పుడే ఉండదనుకున్నారు అంతా కూడా.. కానీ అనూహ్యంగా
ఎన్టీఆర్ 31 అల్ట్రామాస్ పాన్
ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి అలాగే పాన్
ఇండియా ఆడియన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మైత్రీ
మూవీ మేకర్స్ అండ్
ఎన్టీఆర్ ఆర్ట్స్.ఇక ఖచ్చితంగా యంగ్ టైగర్
ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలతో ఊర
మాస్ హిట్లు అందుకోవడం ఖాయంలా అనిపిస్తుంది.కేవలం తెలుగు వాళ్ళకే తెలిసిన
ఎన్టీఆర్ మాస్ అవతారం ఇప్పుడు పాన్
ఇండియా లెవెల్ లో అందరికి తెలియబోతుంది.