మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట చిత్రం మే 12వ తేదీన విడుదల అయ్యింది. విడుదలై దాదాపు 20 రోజులు కావస్తున్న ఈ సినిమా తొలి వారం రోజులు మంచి వసూళ్లు సాధించగా మిక్స్డ్ టాక్ కారణంగా ఈ సినిమా తర్వాత రోజుల్లో మంచి కలెక్షన్లు రాబట్టుకోలేదనే చెప్పాలి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కగా మంచి కాన్సెప్ట్ అయినా ఈ సినిమా ను అందరూ ప్రేక్షకులు ఆదరించలేదు.
దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అన్న టెన్షన్ ను సూపర్ స్టార్ అభిమానులు వ్యక్తపరిచారు. తొలి రోజు నుంచే ఈ సినిమాకు కలెక్షన్లు డ్రాప్ రావడం మొదలుపెట్టాయి. దాంతో సంచలనాత్మక రికార్డులు సృష్టించే కలెక్షన్లు సాధిస్తుంది అనుకున్న ఈ సినిమా కలెక్షన్లు నిరాశజనకంగా వచ్చాయి. చాలామంది ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు కూడా రావని చెప్పారు దాంతో సూపర్ స్టార్ కెరీర్ లో మరొక యావరేజ్ సినిమాగా ఇది మిగులుతుంది అని కూడా చెప్పారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఈ విధంగా అయిపోవడం సూపర్ స్టార్ అభిమానులు ఇప్పటికీ నిద్రపోనివ్వడం లేదు. మొదట్లో కొంతమంది ఇతర హీరోల అభిమానులు ఈ సినిమా గురించి బ్యాడ్ టాక్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత అభిమానులు సైతం ఈ సినిమాకోసం భారీగానే పోరాటం చేశారు. ఒకవేళ ఇతర హీరోల అభిమానులు ఆ విధమైన నెగిటివ్ ప్రచారం చేయకపోయి ఉంటే ఈ సినిమా తప్పకుండా బ్రేక్ ఈవెన్ అయ్యేది. ఇక మహేష్ నెక్స్ట్ సినిమా పైనే భారీ స్థాయిలో ఆశలు నెలకొని ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.