ఈ మధ్యనే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన
చిరంజీవి, ప్రస్తుతం
గాడ్ ఫాదర్ , భోళా శంకర్, మరియు
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికే ఈ
సినిమా సెట్స్ పైకి వెళ్ళాక పోవడంతో
చిరంజీవి ,
వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే
సినిమా ఆగిపోయింది అంటూ, అనేక కథనాలు బయటకు వచ్చాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథనాలు అన్ని రూమర్సే అని తెలుస్తోంది.
వెంకీ కుడుముల స్నేహితుడు ఒకరు తెలియజేసిన కథనం ప్రకారం... చిరంజీవి , వెంకీ కుడుముల
సినిమా ఆగిపోలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. చిరంజీవి తన ప్రస్తుత ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత
చిరంజీవి,
వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే
సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది అని
వెంకీ కుడుముల స్నేహితుడు చెప్పుకొచ్చాడు. దీనితో
చిరంజీవి, వెంకీ కొడుకుల కాంబినేషన్ లో తెరకెక్కబోయే
సినిమా ఆగిపోలేదు అని ఫుల్ క్లారిటీ వచ్చేసింది.