సలార్ : దెబ్బలు తగిలినా యాక్షన్ డోస్ తగ్గేదేలే!

Purushottham Vinay
ఇక 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తరువాత డార్లింగ్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. కానీ సరైన హిట్టుని మాత్రం అందుకోలేకపోతున్నారు.ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన 'సాహో' సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అయినా కానీ ఆడియన్స్ ను మెప్పించలేకపోయిందని చెప్పాలి. అలాగే ఇక రీసెంట్ గా 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ఈ సినిమాలో అయితే లవర్ బాయ్ అవతారంలో కనిపించి పెద్ద సాహసమే చేసాడు ప్రభాస్. కానీ ఈ సినిమా అసలు ప్రేక్షకుల మెప్పుని పొందలేక బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ మూవీగా మిగిలింది. దీంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక ఇప్పటికే తన బాలీవుడ్ సినిమా అయిన 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా క్రేజీ బజ్ నెలకొంది.




ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని.. యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.ఇక ప్రశాంత్ నీల్ కూడా అలానే ప్లాన్ చేశారు. అయితే ఇటీవల ప్రభాస్ కాలికి సర్జరీ అవ్వడంతో యాక్షన్ డోస్ కాస్త తగ్గిస్తున్నారట. ఇది గమనించిన డార్లింగ్ ప్రభాస్.. యాక్షన్ సీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోమని ప్రశాంత్ నీల్ కి చెప్పారట. అలాగే తనకు నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. సినిమాలో మాత్రం ఇంటెన్స్ యాక్షన్ ఉండాలని డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేశారట. ఈసారి ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా తన సినిమా ఉండాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భావిస్తున్నారు. అందుకే తన సర్జరీని ఇంకా అలాగే నొప్పిని కూడా లెక్క చేయకుండా నటిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: